ఫ్లిప్‌కార్ట్‌ లో 700 పైగా ఉద్యోగులను తొలగించనున్నారు

- July 29, 2016 , by Maagulf
ఫ్లిప్‌కార్ట్‌ లో  700 పైగా ఉద్యోగులను తొలగించనున్నారు

ప్రఖ్యాత ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సుమారు 700 మంది ఉద్యోగులను తొలగించనుంది. అమెజాన్‌, స్నాప్‌డీల్‌లతో పోటీ పడడానికి ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా ఉద్యోగులు రాజీనామా చేయాలని లేదా కంపెనీయే తొలగిస్తుందని వెల్లడించినట్లు సమాచారం. తొలగించే ఉద్యోగుల సంఖ్య వెయ్యి కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ పెంచుకోవడానికి బిజినెస్‌ మోడల్స్‌లో పలు మార్పులు చేస్తోంది. అమ్మకందారుల నుంచి మార్జిన్‌ ధరలను కూడా పెంచింది. కొందరు ఉద్యోగుల పనితీరుపై సమీక్ష చేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఉద్యోగులను తొలగించే అంశంపై సరైన సమాచారం ఇవ్వలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com