వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఘనంగా సినారె 86వ జన్మదినోత్సవ వేడుకలు

- July 29, 2016 , by Maagulf
వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఘనంగా సినారె 86వ జన్మదినోత్సవ వేడుకలు

తెలుగు జాతి కీర్తిని తనదైన శైలిలో విశ్వవ్యాప్తం చేసిన కవి సి. నారాయణరెడ్డి అని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు కొనియాడారు. వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో సినారె 86వ జన్మదినోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన నూతన కవితా సంపుటి 'నా రణం మరణం పైనే' పుస్తకాన్ని విద్యాసాగర్‌రావు ఆవిష్కరించారు. రాజ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన డాక్టర్‌ సినారె సమగ్ర సాహిత్యం ఆడియోని ఆవిష్కరించిన డా.యార్లగెడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ.. సినారెకి తాను ఏకలవ్య శిశ్యుడినని ప్రకటించుకున్నారు. సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, అమెరికాకు చెందిన డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, అమెరికాకు చెందిన ప్రముఖ గాయని శారద ఆకునూరి, జుర్రుచెన్నయ్య, నిర్వాహకులు వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి, శుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com