వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా సినారె 86వ జన్మదినోత్సవ వేడుకలు
- July 29, 2016
తెలుగు జాతి కీర్తిని తనదైన శైలిలో విశ్వవ్యాప్తం చేసిన కవి సి. నారాయణరెడ్డి అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనియాడారు. వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సినారె 86వ జన్మదినోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన నూతన కవితా సంపుటి 'నా రణం మరణం పైనే' పుస్తకాన్ని విద్యాసాగర్‌రావు ఆవిష్కరించారు. రాజ్ ఫౌండేషన్ రూపొందించిన డాక్టర్ సినారె సమగ్ర సాహిత్యం ఆడియోని ఆవిష్కరించిన డా.యార్లగెడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. సినారెకి తాను ఏకలవ్య శిశ్యుడినని ప్రకటించుకున్నారు. సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, అమెరికాకు చెందిన ప్రముఖ గాయని శారద ఆకునూరి, జుర్రుచెన్నయ్య, నిర్వాహకులు వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి, శుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







