ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- February 01, 2026
అమరావతి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సీఎం చంద్రబాబు, ‘ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్’ అని ప్రశంసించారు.ఈ బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. టెక్నాలజీ, ఏఐని దేశం వేగంగా అందిపుచ్చుకుంటోందని, దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారని తెలిపారు.
పౌరుల జీవనశైలిని మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందని, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్-చెన్నై కారిడార్లు ఎంతో ప్రయోజనకరమని, అరుదైన ఖనిజాల వెలికితీతతో ఏపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల బలోపేతానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా కేంద్రం 75 శాతం క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వడం,రాష్ట్రం తరఫున మరో 20 శాతం అందిస్తుండటంతో ఈ రంగానికి భరోసా లభిస్తుందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, ఇది 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దేశానికి సరైన దిశానిర్దేశం చేసేలా ఉందని కొనియాడారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







