అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటం !

- July 29, 2016 , by Maagulf
అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటం !

అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ సమావేశాల్లో తమ రాష్ట్రం సమస్యలను వినిపించేందుకు అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు. వెస్ట్ బెంగాల్... డబ్ల్యూతో ప్రారంభమవుతుంది కనుక సమావేశాల చివర్లో ఆ రాష్ట్రం తరపున వాదనలు వినిపించవలసి వస్తోందని, అప్పటికి ఇతర రాష్ట్రాల వాదనలు వినే కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు నీరసించిపోతున్నారని, ఫలితంగా తమకు అవకాశం దక్కడం లేదని వాపోతున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ఆమె తన రాష్ట్రం పేరును బెంగాల్ అని కానీ, బంగ్లా అని కానీ మార్చాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com