కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ 1,100 బస్సులు..

- July 29, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ 1,100 బస్సులు..

రాష్ట్రంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించే కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ 1,100 నడపనున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ డి.వేణు తెలిపారు. శుక్రవారం ఆయన మఠంపల్లి మండలం మట్టపల్లి, దామరచర్ల మండలం వాడపల్లిలోని పుష్కర ఘాట్లను, పార్కింగ్‌ స్థలాలను, బస్టాండ్లు, దేవాలయాల పరిసరాలను ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు.అనంతరం మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణానదిలో ప్రధాన ఘాట్లను చేరుకునేందుకుగాను నల్లగొండ జిల్లాకు 330, మహబూబ్‌నగర్‌ జిల్లాకు 450 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడపనున్నట్లు చెప్పారు. అదేవిధంగా పార్కింగ్‌ ప్రాంతాల నుంచి వివిధ స్నానఘాట్ల వరకు ఉచితంగా బస్సులను నడిపిస్తామన్నారు. అందులో భాగంగా మట్టపల్లికి 20, వాడపల్లి 25, బుగ్గమాదారం 3, వజినేపల్లికి 3 చొప్పున ఉచిత షటిల్‌ సర్వీసులను నడుపుతామన్నారు. వీటితోపాటు ప్రాధాన్యత గల మట్టపల్లికి 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వరకు 200 బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఇక పుష్కరాల నేపథ్యంలో చార్జీలను 20 నుంచి 50 శాతం వరకు పెంచే అవకాశం ఉందని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన lవెంట ఆర్టీసీ ఆర్‌ఎం కృష్ణహరి, డిప్యూటీ సీటీఎం మధుసూదన్, డీఎంలు ఎన్‌.శ్రీనివాస్, కృష్ణహరి, సుధాకర్, సైదా, సూపరింటెండెంట్‌ నాగిరెడ్డి, సత్యనారాయణరాజు, దేవాలయ కమిటీ చైర్మన్‌ కొందూటి సిద్ధయ్య ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com