విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్‌పోస్ట్ ఏర్పాటు

- July 29, 2016 , by Maagulf
విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్‌పోస్ట్ ఏర్పాటు

విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరణించిన వారి మృతదేహాలను విమానాల్లో హైదరాబాద్‌కు తరలించడం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో విభాగానికి ప్రతి రోజూ రెండు మూడు మృతదేహాలు వస్తున్నాయి. వీటిని అప్పగిం చడానికి ఎయిర్ కార్గో అధికారులు శంషాబాద్ పోలీసుల నుంచి ఎన్‌వోసీ తీసుకురావడం తప్పనిసరి చేశారు.పోలీసుస్టేషన్ విమానాశ్రయానికి 9 కి.మీ. దూరంలో ఉండటంతో మృతదేహాలు తీసుకువెళ్లడానికి వస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శంషాబాద్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. నిబంధనలను అనుసరించి ఎన్‌వోసీలు జారీ చేయనున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com