'నాగబంధం' టీజర్ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న రిలీజ్
- February 03, 2026విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'నాగబంధం'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు అద్భుతమైన రెస్పాన్ తో అంచనాలను పెంచాయి. ఈ చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి 15, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఆకట్టుకునే టీజర్ పోస్టర్‌లో ఒక పురాతన ఆలయంలోని రహస్య నిధి చుట్టూ రక్షణగా చుట్టుకుని ఉన్న ఒక మహా నాగుపాము కనిపిస్తుంది. ఇది సినిమాలోని ఆధ్యాత్మిక దైవిక రహస్యాన్ని సూచిస్తుంది. భారతదేశంలోని చారిత్రాత్మక విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, ఆర్‌సి ప్రణవ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న 'నాగబంధం' చిత్రం తుది నిర్మాణ దశకు చేరుకుంది. ఈ వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
సీఈఓ: వాసు పోతిని
పీఆర్ఓ: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్







