రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- February 03, 2026
మనామా: బహ్రెయిన్ రమదాన్ కోసం సిద్ధమవుతోంది. ఈ ఫెస్టివ్ సీజన్ మార్కెట్లు, రిటైల్ నుండి హాస్పిటాలిటీ , సర్వీసెస్ వరకు ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. రిటైలర్లు ఖర్జూరం, బియ్యం, సుగంధ ద్రవ్యాలు మరియు వంట నూనె వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేసుకుంటారు. సూపర్ మార్కెట్లు ముందస్తు ప్రమోషన్లను అందించడం ప్రారంభిస్తాయి. షాబాన్ నాటికి షాపింగ్ పుంజుకుంటుంది. ఇళ్లు ఇఫ్తార్ మరియు సుహూర్ భోజనాలకు సిద్ధమవుతాయ. దీంతో స్థానిక మార్కెట్లు మరియు కిరాణా దుకాణాల వద్ద రద్దీ నెలకొంటుంది.
ఫుడ్ మరియు హాస్పిటాలిటీ
రమదాన్ సమీపిస్తున్న కొద్దీ ఫుడ్ మరియ బివరేజేస్ వ్యాపారాలు ఊపందుకుంటాయి. రెస్టారెంట్లు మరియు కేఫ్‌లు ప్రత్యేక ఇఫ్తార్ మరియు సుహూర్ మెనూలను ప్రకటిస్తాయి. అయితే హోటళ్ళు కార్పొరేట్ మరియు ఫ్యామిలీల బుకింగ్‌ల కోసం పూర్తి బ్లాక్‌లను రిజర్వ్ చేస్తాయి. క్యాటరర్లు సంవత్సరంలో అత్యంత రద్దీగా ఉండే కాలాల్లో ఒకటిగా భావిస్తారు. కమ్యూనిటీ సమావేశాలు మరియు ఇతర కార్యక్రమాల కోసం తయారుచేసిన ఫుడ్ కు డిమాండ్ బాగా పెరుగుతోంది.
రిటైల్ మరియు గిఫ్టుల సేల్స్
రమదాన్ షాపింగ్ ఆహారానికి మాత్రమే పరిమితం కాదు. ఈద్ వేడుకలకు సన్నాహకంగా క్లాత్స్, హోం డెకరేషన్ మరియు సాంప్రదాయ బహుమతులను కొనుగోలు చేస్తారు. స్థానిక మాల్స్ మరియు సూక్‌లు సాయంత్రం కార్యకలాపాలను పెంచుతాయి. ముఖ్యంగా తరావీహ్ ప్రార్థనల తర్వాత దుకాణదారులు క్లాత్స్, యాక్సెసరీస్, లాంతర్లు మరియు స్వీట్లను కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపుతారు.
ప్రైస్ సెన్సిటివిటీ మరియు సప్లై ఛాలెంజెస్
రజబ్ నుండి రమదాన్ వరకు ఉన్న కాలం మార్కెట్ సున్నితత్వాన్ని హైలైట్ చేస్తుంది. ఫుడ్ మరియు ఇంధన ధరల హెచ్చుతగ్గులు హోం బడ్జెట్లను ప్రభావితం చేస్తాయి. అధిక డిమాండ్ ఉన్న కాలంలో స్థిరమైన ధరలను మెయింటన్ చేసేందుకు వీలుగా హోల్ సెల్లర్స్ మరియు రిటైలర్లు ముందుగానే స్టాకును ముందే నిల్వ చేసేందుకు ప్రణాళికలు వేస్తారు.
సర్వీసులు మరియు నైట్ టైమ్ ఎకానమీ
ఈవెంట్ ప్లానర్లు, ప్రింటింగ్ సేవలు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు మరియు కమ్యూనిటీ సంస్థలు అన్నీంటా రమదాన్ వరకు డిమాండ్ పెరుగుతుంది. తక్కువ డే టైమ్ వర్కింగ్ అవర్స్ కారణంగా సాయంత్రం వరకు వర్కింగ్ అవర్స్ మారుతుంటాయి. దీంతో ఆయా వ్యాపారాలు ఏటా ప్రత్యేకమైన బిజినెస్ టైమింట్స్ కు ఫిష్ట్ అవుతాయి.
రమదాన్ సమయంలో కార్పొరేట్ రంగం స్లో
బహ్రెయిన్‌లోని కార్పొరేట్ కార్యాలయాలు రమదాన్ సమయంలో మందగమనాన్ని సూచిస్తాయి. చాలా కంపెనీలు పని వేళలను సర్దుబాటు చేస్తాయి. పగటిపూట సమావేశాలను తగ్గిస్తాయి. నియామకాలు లేదా ప్రధాన ప్రాజెక్టులను ఈద్ తర్వాత వరకు వాయిదా వేస్తాయి. ఈ తాత్కాలిక విరామం నియామకాలు, వేతనాలు మరియు వృత్తిపరమైన సేవలను ప్రభావితం చేస్తుంది. ఇది డే టైమ్ ఆర్థిక కార్యకలాపాలలో స్వల్పకాలిక తగ్గుదలను నమోదు చేస్తుంది.
ఒక ముఖ్యమైన సీజనల్ బూస్ట్
కార్పొరేట్ కార్యకలాపాలు నెమ్మదించినప్పటికీ, రజబ్-నుండి-రమదాన్ కాలం బహ్రెయిన్ ఫుడ్, హాస్పిటాలిటీ మరియు రిటైల్ రంగాలకు కీలకమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈవెనింగ్ మార్కెట్లు, ఇఫ్తార్ సమావేశాలు మరియు కమ్యూనిటీ ఈవెంట్లు ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్ అందిస్తుంది. రమదాన్ సీజన్ ఎల్లప్పుడూ కార్పొరేట్ కార్యాలయాల నుండి మార్కెట్లు, రెస్టారెంట్లు మరియు ఫ్యామిలీస్ పై అత్యంత ప్రభావం చూపుతుందని బిజినెస్ అనలిస్టులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







