ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!

- February 03, 2026 , by Maagulf
ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!

కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (సీబీకే) ఎక్స్ఛేంజ్ కంపెనీలు కస్టమర్ల నుండి స్వీకరించగల రోజువారీ క్యాష్ లిమిట్ ను రోజుకు కేడీ 1,000కి తగ్గించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చాయని ఒక ప్రకటలో తెలిపింది. అయితే, గతంలో కస్టమర్లు కేడీ 3,000 వరకు నగదు రూపంలో చెల్లించడానికి అనుమతి ఉండేది.  కానీ కొత్త నిబంధన ప్రకారం, ఎక్స్ఛేంజ్ కంపెనీలలో కేడీ 1,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులను ఇకపై అనుమతించరు.

అయితే, లావాదేవీల మొత్తం విలువపై ఎటువంటి పరిమితి లేదని, ఈ పరిమితి చెల్లింపులోని నగదుకు మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.  విదేశీ డబ్బు బదిలీలకు అలాగే విదేశీ కరెన్సీల కొనుగోలు మరియు అమ్మకాలకు కూడా వర్తిస్తుందని తెలియజేసింది. మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సరఫరాకు వ్యతిరేకంగా నియంత్రణలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com