ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- February 03, 2026
దోహా: ఫిబ్రవరి 5 నుండి 10 వరకు ఓల్డ్ దోహా పోర్టు ఫిట్నెస్, వెల్నెస్ కు కేంద్రంగా మారనుంది. ఆరు రోజులపాటు సాగే స్పోర్ట్స్ ఫెస్టివల్ MOVE కోసం టిక్కెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఓల్డ్ దోహా పోర్టు ప్రకటించింది. ఒకే వేదికపై స్పోర్ట్స్ వేర్, స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ లతోపాటు వివిధ క్రీడలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదే సమయంలో సందర్శకులు ఎరాడా ఫిట్నెస్, మ్యాట్రిక్స్ జిమ్ మరియు A13 అకాడమీ అందించే రోజువారీ ఫిట్నెస్ సెషన్లలో కూడా పాల్గొనవచ్చని తెలిపింది.
స్పోర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా ఎరాడా ఫిట్నెస్ త్రోడౌన్ 2026 పేరిట ఫిట్నెస్ గేమ్స్ స్పెషల్ అని, ఈ కార్యక్రమం ఫిబ్రవరి 6న మహిళల పోటీతో ప్రారంభమవుతుందని తెలిపారు. ఇది ఒక ప్రైవేట్ మహిళలు మాత్రమే పాల్గొనే ఈవెంట్ అని, తరువాత ఫిబ్రవరి 7న పురుషుల పోటీ జరుగుతుందని ఓల్డ్ దోహా పోర్ట్ CEO ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా పేర్కొన్నారు. MOVE కోసం టిక్కెట్లు వర్జిన్ మెగాస్టోర్ లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







