వెబ్‌సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!

- February 03, 2026 , by Maagulf
వెబ్‌సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!

యూఏఈ: తన అధికారిక వెబ్‌సైట్‌ డౌన్ కావడంపై యూఏఈ లాటరీ స్పందించింది. కొందరు కస్టమర్లు తమ వెబ్ సైట్ ను యాక్సెస్ సమయంలో కొన్ని టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నట్లు యూఏఈ లాటరీ వెల్లడించింది.

అయితే, గేమింగ్ ఆపరేటర్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ టెక్నికల్ సపోర్టు టీమ్స్ ఈ లోపాన్ని పరిశీలిస్తున్నాయని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి, యాక్సెస్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొంది.  

తక్షణ సహాయం కోసం కస్టమర్‌లు 800 2365 నంబర్‌లో యూఏఈ లాటరీ యొక్క కస్టమర్ సపోర్ట్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు లేదా [email protected] కు ఇమెయిల్ చేయవచ్చని తెలిపింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com