20 మిలియన్ దిర్హమ్‌లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- February 04, 2026
యూఏఈ: బిగ్ టికెట్ అబుదాబి లైవ్ డ్రాలో భారత ప్రవాసుడు 20 మిలియన్ దిర్హమ్‌లను గెలుచుకున్నారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న భారతీయ ప్రవాసి శాంతలు షిట్టిగర్.. జనవరి 20న టికెట్ నంబర్ 305810ను విజేతగా నిలిచారు. మరొక స్నేహితుడితో కలిసి టికెట్ కొనుగోలు చేసినట్టు, చెరో 10 మిలియన్ దిర్హమ్‌లు పంచుకోనున్నట్లు షిట్టిగర్ పేర్కొన్నాడు.
1 మిలియన్ దిర్హమ్‌ల ఐదు కన్సోలేషన్ బహుమతులు కూడా ప్రకటించారు. ఇండియాకు చెందిన జెన్సీ రూబా, దేశన్ కున్షు, సంతోష్ కుమార్ లతోపాటు శ్రీలంకకు చెందిన దులాన్ మయూర, బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ అబు సయ్యద్ తాజా డ్రాలో 1 మిలియన్ దిర్హమ్‌ల చొప్పున గెలుచుకున్నారు. వీరితోపాటు షార్జాలో నివసిస్తున్న ఒక బంగ్లాదేశీ ప్రవాసి షాహిన్ మియా BMWX5 కారును గెలుచుకున్నాడు.
భారత్ మరియు బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు ప్రవాసులు బిగ్ విన్ పోటీలో Dh150,000 చొప్పున గెలుచుకున్నారు. విజేతలలో ఒమన్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసి కౌశిక్ ఉదేశి, డయానా ప్రిన్సీ ఉన్నారు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్‌లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







