మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- February 04, 2026
మనామా: ఒక ఆసియా వ్యక్తిని హత్య చేసిన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును పూర్తి చేసిందని మరియు ఒకే జాతీయతకు చెందిన ఇద్దరు అనుమానితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసినట్లు నార్తర్న్ గవర్నరేట్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు. విచారణ ఫిబ్రవరి 9న హై క్రిమినల్ కోర్టు ముందు జరగనుంది.
అల్-బుదయ్య ప్రాంతంలోని ఒక సందులో బాధితుడి మృతదేహాన్ని గుర్తించినట్టు నార్తర్న్ గవర్నరేట్ డైరెక్టరేట్ తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు, నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు. 12 సంవత్సరాల క్రితం తమ స్వదేశంలో జరిగిన వివాదం ఈ దాడికి కారణమైందని, బంధువుపై ప్రతీకారంగా ఈ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్టు వారు వెల్లడించారు.
నిందితులు రెండు నెలల పాటు బాధితుడిని వెంబడించి, హత్య జరిగిన రోజు అతని ఇంటి సమీపంలో అతనిపై దాడి చేసి, అనేకసార్లు పొడిచి చంపి, పారిపోయారని బాధితులు తెలిపారు. ఆధారాలను సమీక్షించిన తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులిద్దరినీ కస్టడీలోనే ఉంచి విచారణ చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







