మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!

- February 04, 2026 , by Maagulf
మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!

మనామా: ఒక ఆసియా వ్యక్తిని హత్య చేసిన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును పూర్తి చేసిందని మరియు ఒకే జాతీయతకు చెందిన ఇద్దరు అనుమానితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసినట్లు నార్తర్న్ గవర్నరేట్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు. విచారణ ఫిబ్రవరి 9న హై క్రిమినల్ కోర్టు ముందు జరగనుంది.

అల్-బుదయ్య ప్రాంతంలోని ఒక సందులో బాధితుడి మృతదేహాన్ని గుర్తించినట్టు  నార్తర్న్ గవర్నరేట్ డైరెక్టరేట్ తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది.  మరోవైపు, నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు. 12 సంవత్సరాల క్రితం తమ స్వదేశంలో జరిగిన వివాదం ఈ దాడికి కారణమైందని, బంధువుపై ప్రతీకారంగా ఈ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్టు వారు వెల్లడించారు.

నిందితులు రెండు నెలల పాటు బాధితుడిని వెంబడించి, హత్య జరిగిన రోజు అతని ఇంటి సమీపంలో అతనిపై దాడి చేసి, అనేకసార్లు పొడిచి చంపి, పారిపోయారని బాధితులు తెలిపారు. ఆధారాలను సమీక్షించిన తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులిద్దరినీ కస్టడీలోనే ఉంచి విచారణ చేయాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com