ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్‌ హెచ్చరిక..!!

- February 08, 2026 , by Maagulf
ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్‌ హెచ్చరిక..!!

దోహా: వాహన అనుమతి పత్రంలో పేర్కొన్న వాటిని మినహా ఇతర ఏ ప్రయోజనం కోసం అయినా ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడం ట్రాఫిక్ ఉల్లంఘన అవుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ ఖతార్‌లోని వాహన యజమానులకు గుర్తు చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడం ట్రాఫిక్ ఉల్లంఘన కిందకు వస్తుందని, వాహన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ (5/57) ప్రకారం, మోటారు వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ పత్రంలో పేర్కొన్న వాటిని మినహా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు లేదా అనుమతించకూడదని అని స్పష్టంగా తెలిపింది. ఈ నిబంధనలను రహదారి భద్రతను నిర్ధారించడానికి, దేశవ్యాప్తంగా రవాణా కార్యకలాపాలను నియంత్రించడానికి కఠినంగా అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com