అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

- February 08, 2026 , by Maagulf
అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి పై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణలోని అన్ని ప్రధాన దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి వరకు దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం అవసరమైతే రూ.3-4 వేల కోట్లు నిధులు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com