ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!

- February 09, 2026 , by Maagulf
ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!

యూఏఈ: దుబాయ్ లోని అల్ ఖుద్రా రోడ్డు మరియు అరేబియన్ రాంచెస్‌ను దుబాయ్ స్టూడియో సిటీతో కలిపే లింక్ రోడ్డు ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జిని ప్రారంభించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ ప్రకటించింది. నాలుగు లేన్‌లతో కూడిన 600 మీటర్ల ఈ బ్రిడ్జి, అల్ ఖుద్రా రోడ్డు వెంబడి ఉన్న ప్రధాన ఇంటర్ సెక్షన్స్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగం అని తెలిపింది.

ఈ కొత్త కారిడార్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుతో కలిసే ఇంటర్ సెక్షన్ నుండి ప్రారంభమై, షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మరియు ఎమిరేట్స్ రోడ్డు మీదుగా వెళుతుంది.  కొత్త బ్రిడ్జి  ట్రాఫిక్ సామర్థ్యాన్ని 191 శాతం పెంచి, గంటకు 6,600 వాహనాల నుండి గంటకు 19,200 వాహనాలకు చేరుస్తుందని అథారిటీ తెలిపింది.   

కాగా, అల్ ఖుద్రా రోడ్డు మరియు షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించిన ఈస్ట్ బ్రిడ్జిని ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నట్లు అథారిటీ వెల్లడించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com