తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- February 10, 2026
న్యూ ఢిల్లీ: తిరుపతి విమానాశ్రయం నుండి గల్ఫ్,యూరప్,అమెరికా మరియు అబుదాబి దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని"రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాధరెడ్డి" కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య,నెల్లూరు, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో గల్ఫ్, యూరప్ మరియు పాశ్చాత్య దేశాలలో ఉపాధి పొందుతున్నారని మరియు ఈ ప్రాంతాలనుండి ప్రయాణీకులు ఉన్నత విద్య, ఉద్యోగరీత్యా, వ్యాపారం కోసం తరచుగా ప్రయాణిస్తుంటారని, తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం వలన చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఇది అనవసరమైన ఆర్ధిక భారాన్ని ముఖ్యంగా ఉపాధి కోసం వెళ్ళేవారికి ఆర్ధిక పరమైన భారాన్ని ఎక్కువ ప్రయాణ సమయాన్ని సీనియర్ సిటిజెన్ లకు, మహిళలు మరియు పిల్లలకు మరింత ఇబ్బందిగా మారిందని తెలిపారు.ఇదే కాకుండా దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయినా తిరుమలకు పాశ్చాత్య దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు నేరుగా తిరుపతికి రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
కావున ప్రయాణీకుల ప్రయోజనాల దృష్ట్యా మరియు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నుండి నేరుగా గల్ఫ్ మరియు వివిధ దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









