ఏఎన్32 కోసం విశాఖ అడవుల్లో గాలింపు

- July 30, 2016 , by Maagulf
ఏఎన్32 కోసం విశాఖ అడవుల్లో గాలింపు

ఇటీవల గల్లంతైన భారత వాయుసేనకు చెందిన విమానం (ఏఎన్‌-32) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాన్ని వెతికేందుకు సహాయం చేయాల్సిందిగా భారత్‌.. అమెరికాకు సైతం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికుల సమాచారంతో విమానం కోసం విశాఖ అడవుల్లో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి నాతవరం మండలంలోని సరుగుడు, దద్దుగుల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com