వాట్సాప్ వాడుతున్నారా అయితే కొంచం జాగ్రత్త వహించాలి
- July 30, 2016
కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ మెసేజింగ్ ను వాడుతున్నారా..? అయితే ఈ ప్లాట్ ఫామ్ పై సందేశాలు పంపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలంటున్నారు సెక్యురిటీ నిపుణులు. డిజిటల్ సందేశాల ప్రైవేసీ కోసం వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చినా అది కేవలం మూడో వ్యక్తి బారినుంచే కాపాడుతుందట. పూర్తిగా మెసేజ్ ల ప్రొటెక్షన్ కు ఉపయోగపడదంట. యూజర్లు డిలీట్ చేసిన మెనేజ్ లు వెంటనే తమ ఫోన్లనుంచి తొలిగిపోవని యాపిల్ ఐఓఎస్ సెక్యురిటీ నిపుణుడు జోనాథన్ ఓ సంచలన వార్తను తెలియజేశారు. స్క్రీన్ పై వెంటనే కనిపించకుండా పోయినా.. యూజర్ల స్మార్ట్ ఫోన్ లో అవి అలానే సేవ్ అయి ఉంటాయని వెల్లడించారు.
యాప్ తాజా వెర్షన్ లో డిలీట్, క్లియర్, ఆర్కైవ్ చేసిన , క్లియర్ ఆల్ చాట్స్ అన్న పర్మినెంట్ గా డిలీట్ కావని పేర్కొన్నారు. అలా చేసిన మెసేజ్ లను ఫోరెన్సిక్ ద్వారా గుర్తించి టెస్ట్ కూడా చేశామన్నారు. ఫోరెన్సిక్, రికవరీ సాప్ట్ వేర్ ద్వారా డేటాను రికవరీ చేసుకోవచ్చన్నారు. ఎస్ క్యూ లైట్ లైబ్రరీని తాజా యాప్ కోడ్ కోసం వాట్సాప్ వాడుతుందని, ఆ లైబ్రరీ వాట్సాప్ చాట్ ను పూర్తిగా డిలీట్ కాకుండా చూస్తుందన్నారు. వాట్సాప్ చాట్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే, వాట్సాప్ ను ఫోన్ నుంచి పూర్తిగా తొలగించే మార్గమమే ఉత్తమని ఆయన సూచించారు. అప్పుడైతేనే యూజర్లు డిలీట్ చేసిన చాట్స్ అన్నీ పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







