'శ్రీరస్తు శుభమస్తు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరుకానున్న చిరు, చెర్రీలు

- July 30, 2016 , by Maagulf
'శ్రీరస్తు శుభమస్తు'  ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరుకానున్న చిరు, చెర్రీలు

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ చిత్రాలకి సంబంధించిన షూటింగ్స్ జరుగుతున్నాయంటే అది కచ్చితంగా మెగాహీరోల వల్లనే. చిన్న సైజు క్రికెట్ టీం లా ఉన్న మెగా హీరోలు ప్రతి రోజు ఏదొక మూవీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంటారు. దీంతో మెగాహీరోలతో కొద్దిపాటి పరిచయం ఉన్నా చాలు, ఏదొక సమయంలో డైరెక్షన్ అవకాశం వచ్చేస్తుందనేది కొత్త దర్శకుల అభిప్రాయం. ఇక ఒక మెగాహీరోతో మూవీ హిట్ అయిందంటే...ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో సినిమాకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది.
అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలోని టెక్నిషియన్స్ కి మెగాహీరోలు అంటే భలే క్రేజ్ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాహీరో అల్లుశిరీష్ నటిస్తున చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. 'పరశురాం' దర్శకత్వంలో 'అల్లు అరవింద్' ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక శ్రీరస్తు శుభమస్తు టీజర్ కి మెగా ఫ్యాన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో జూలై 31న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి 'మెగాస్టార్ చిరంజీవి' తో పాటు తనయుడు రామ్ చరణ్ సైతం రానున్నారని అంటున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ వారి మూవీలకి సంబంధించిన షూటింగ్ లతో ఫుల్ బిజిగా ఉన్నారు. అలాగే మెగాస్టార్ నటిస్తున్న సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగానూ ఉంటున్నారు. అయితే అల్లుశిరీష్ సినిమా అయిన శ్రీరస్తు శుభమస్తు ప్రి రిలీజ్ ఫంక్షన్ కి.చిరంజీవి, రామ్ చరణ్ లు ముఖ్య అతిథులుగా రానుండటంతో ఈ ఫంక్షన్ కి కొత్త హంగు ఏర్పడనుంది. ఇక వీరిద్దరూ కలిసి ఇచ్చే స్పీచ్ ని వినటం కోసం మెగాఫ్యాన్స్ అప్పుడే రెడీ అయ్యారు.
ఇదిలా ఉంటే శ్రీరస్తు శుభమస్తు మూవీకి ఎస్. థమన్ సంగీతం అందిచగా, శిరీష్ సరసన 'లావణ్యా త్రిపాఠి' హీరోయిన్ గా నటించింది. ఇక అల్లుశిరీష్ ఈ మధ్య కాలంలో చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. మంచి కథ కోసమే ఇన్నాళ్ళు ఆగాడని తను చెబుతున్నసమాధానం. అయితే ఇకనుండి వరుస పెట్టి సినిమాలు చేయాలనేది అల్లుశిరీష్ తీసుకున్న నిర్ణయం గా తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం తన చేతిలో 3 సినిమాలకి సంబంధించిన కథా చర్ఛలు జరుగుతున్నాయి. శ్రీరస్తు శుభమస్తు రిలీజ్ అనంతరం వీటికి సంబంధించిన ప్రోగ్రెస్ ముందుకు వెళ్లనుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com