ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం..!!

- February 12, 2026 , by Maagulf
ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ లో పర్యటనలకు సంబంధించి అన్నిసేవలు అందించేలా రూపొందించిన వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు ఒమన్ హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్యంగా ఐరన్‌మ్యాన్ ఛాంపియన్‌షిప్‌ కు అనుగుణంగా పర్యాటక ప్యాకేజీల కోసం డిజిటల్ గేట్‌వేగా పనిచేస్తుందన్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే వారితో పాటు అతిథులు మరియు సందర్శకులు తమ ప్రయాణాలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని తెలిపింది. 

ఇది స్థానిక పర్యాటక కంపెనీలు మరియు ఫ్లైట్స్, వసతి, రవాణా, టూర్ ఆపరేటర్లు, గైడెడ్ టూర్లు వంటి సమగ్ర సేవలను అందిస్తుందన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 200 కంటే ఎక్కువ పర్యాటక సర్వీస్ ప్రొవైడర్స్, 350 కంటే ఎక్కువ పర్యాటక ప్రాంతాలు, 56 పర్యాటక ప్యాకేజీలు మరియు 140 కంటే ఎక్కువ హోటల్స్ ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com