సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- February 12, 2026
రియాద్: సౌదీ అరేబియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు $140 బిలియన్లకు పెరిగిందని, మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికాలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉందని సౌదీ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అబ్దుల్లా అల్స్వాహా అన్నారు. రియాద్ 2026లో మైక్రోసాఫ్ట్ AI టూర్లో భాగంగా జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏఐ యుగంలో ప్రపంచ కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సౌదీ వేగంగా ముందుకు సాగుతోందని అల్స్వాహా తెలిపారు.
డేటా సెంటర్ సామర్థ్యం 80 మెగావాట్ల నుండి 440 మెగావాట్లకు పెరిగిందన్నారు. నేటికి ఎనిమిది టెక్ స్టార్టప్‌లు యూనికార్న్ హోదాకు చేరుకున్నాయని తెలిపారు. జాతీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం ఒక వ్యూహాత్మక మలుపు అని, టెక్ నిపుణుల సంఖ్య 150,000 నుండి 406,000 కు పెరిగిందని, రాజ్యం ఈ ప్రాంతంలోని అతిపెద్ద సాంకేతిక ప్రతిభ కేంద్రాలలో ఒకటిగా మారిందని అల్స్వాహా వివరించారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్









