యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!

- February 13, 2026 , by Maagulf
యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!

యూఏఈ: జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం BMW తన కార్లలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కార్లను రీకాల్‌ చేస్తోంది.ఇందులో భాగంగా యూఏఈ నివాసితులు వారి వాహనాలకు రిపేర్లు చేయాలని డీలర్లను సంప్రదిస్తున్నారని, వారికి ఒకేరోజు సమస్యను సరిచేసి డెలివరీ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇంజిన్ స్టార్టర్‌కు సంబంధించిన అగ్ని ప్రమాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు BMW ప్రకటించింది.కంపెనీ వెబ్‌సైట్‌లో వాహన గుర్తింపు సంఖ్య (VIN)ని నమోదు చేయడం ద్వారా వారి వాహనం ప్రభావితమైందో లేదో కూడా తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. BMW ప్రకారం, జూలై 2020 మరియు జూలై 2022 మధ్య తయారైన స్టార్టర్‌తో కూడిన 16 మోడళ్లు ప్రభావితం అయ్యాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com