పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!

- February 13, 2026 , by Maagulf
పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!

దోహా: ఖతార్ లో ఈ వారంతంలో పొగమంచు భారీగా ఉంటుందని, దాంతో విజిబిలిటీ తగ్గుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని వాహనదారులకు సూచించింది. ఈ మేరకు ఓ సోషల్ మీడియా పోస్ట్‌ చేసింది. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మరియు లో విజిబిలిటీ పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ స్టయిల్ ను సర్దుబాటు చేసుకోవాలని కోరింది.
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అత్యవసర ప్రమాద లైట్లు లేదా హై బీమ్‌లను ఉపయోగించవద్దని, బదులుగా ఫాగ్ లైట్లు మరియు తక్కువ బీమ్‌లపై ఆధారపడాలని సూచించారు. వాహనదారులు కూడా తమ లేన్‌లోనే ఉండి ఓవర్‌టేకింగ్ లేదా తరచుగా లేన్ మార్పులను నివారించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా వాహనాలు పరస్పం ఢీకొనే అవకాశాలను తగ్గిస్తుందని తెలిపారు. కారు విండోలను క్లియర్ గా ఉంచడానికి మరియు విజిబిటీని పెంచడానికి వాహన డీఫ్రాస్టర్‌లు మరియు విండ్‌షీల్డ్ వైపర్‌లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ డ్రైవర్లకు సూచించింది. వాహనాల మధ్య ఎక్కువ ఫాలోయింగ్ దూరాన్ని పాటించాలని, ఆకస్మిక స్టాప్‌లు లేదా అడ్డంకులకు ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని తెలిపింది. ఖతార్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి సేఫ్టీ గైడ్ లైన్స్ ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com