సినిమా సూపర్ అంటున్న రానా
- July 30, 2016
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, నందు తదితరులు ప్రధాన పాత్రల్లో శుక్రవారం విడుదలైన చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ చిత్రాన్ని చూసిన హీరో రానా ట్విట్టర్ వేదికగా యూనిట్ సభ్యులను ప్రశంసించారు. చిత్రం నచ్చిందని, తరుణ్ భాస్కర్ చెప్పిన కథ చాలా బావుందని, కచ్చితంగా చిత్రాన్ని చూడండని అభిమానులను కోరారు. హీరోహీరోయిన్లు విజయ్, రితూ వర్మ నటన అద్భుతంగా ఉందని ప్రత్యేకంగా అభినందించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విడుదలైన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







