టెక్సాస్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 16 మంది దుర్మరణం
- July 30, 2016
అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 16 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. దక్షిణ ఆస్టిన్లోని లఖార్ట్ సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పర్యాటకులంతా మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.స్థానిక కాలమానం ప్రకారం.. 7.40 ప్రాంతంలో బెలూన్‌లో మంటలు చెలరేగడతో బెలూన్ నేలపై కుప్పుకూలినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్ఏఏ) పేర్కొంది. ఈ ఘటనకు గల కారణాలపై ఎఫ్ఏఏ అధికారులు విచారణ చేపట్టారు. చివరకు జాతీయ రవాణా భద్రత సంస్థ కూడా ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి దిగింది. బెలూన్ ప్రమాదంలో మృతిచెందినవారి పట్ల టెక్సాస్ గవర్నర్
గ్రెగ్ అబోట్ సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







