భీమవరంలో 'నిర్మలా కాన్వెంట్' సినిమా పాటల ఆవిష్కరణ
- July 30, 2016
ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ తనయుడు రోహన్ శ్రీకాంత్ భీమవరంలో శనివారం సందడి చేశారు. రోహన్ హీరోగా నటించిన నూతన చిత్రం 'నిర్మలా కాన్వెంట్ సినిమా'లోని పాటల ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో రోహన్ సినిమాలోని డైలాగులను వినిపించి పాటలకు డ్యాన్స్ చేసి విద్యార్థులను ఉర్రూతలూగించారు. సినిమా సంగీత దర్శకుడు రోషన్ సాలూరి, మరో నలుగురు గాయకులు చిత్రంలోని పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో శనివారం రాత్రి జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో కళాశాలలోని ప్రథమ, ద్వితీయ సంవత్సరాల బీటెక్ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







