తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- February 15, 2026
న్యూ ఢిల్లీ: బాంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన, చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. “చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో ముడిపడి ఉన్న పొరుగు దేశంగా, తారిఖ్ రెహమాన్ నాయకత్వంలో ఏర్పడుతున్న ఎన్నికైన ప్రభుత్వాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న బంగ్లాదేశ్‌కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది” అని ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలిచిన తారిఖ్ ఢాకాలో ఈ నెల (ఫిబ్రవరి) 17న ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే.
2024లో అవామీ లీగ్ పార్టీ నేతృత్వంలోని షేక్ హసీనా ప్రభుత్వం.. అంతర్గత ఘర్షణల కారణంగా పతనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మొదటి జాతీయ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్‌తో పాటు మరో 12 దేశాలను ఆహ్వానించింది.
అందులో చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, శ్రీలంక ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.297 పార్లమెంట్ స్థానాలు ఉన్న బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ ఏకంగా 209 స్థానాలను గెలుచుకుంది. దీంతో దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక బీఎన్‌పీ మిత్రపక్షమైన జమాత్ ఏ ఇస్లామీ 68 స్థానాలు దక్కించుకుంది. మరోవైపు.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







