మలేషియాలో ఏపీ వాసి మృతి
- February 15, 2026
కౌలాలంపూర్: అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె, కొన్నయ్యగారిపల్లి గ్రామానికి చెందిన బొమ్మవరం శంకరమ్మ గత సంవత్సరం 21 డిసెంబర్ 2025 న కోలాలంపూర్ హాస్పిటల్ లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల కలిగే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ తో మరణించింది.
ఈ విషయం ఆసుపత్రి సిబ్బంది ఇండియన్ ఎంబసీకి తెలియజేశారు, తర్వాత ఇండియన్ ఎంబసీ ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్,మలేషియా కి మరియు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కి వారి కుటుంబ సభ్యులను కానీ దగ్గర బంధువుల ను గుర్తించాలని అభ్యర్ధించింది.ఆ వెంటనే ఫెడరేషన్ అఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ డిప్యూటీ ప్రెసిడెంట్ కృష్ణ ముత్తినేని మృతుని భర్త మరియు వారి బంధువుల ఆచూకీ కనుక్కొని బొమ్మవరం శంకరమ్మ మరణించిన వార్తని వారికీ తెలియజేసి మృతదేహం పంపడానికి కావాల్సిన డాకుమెంట్స్ అన్ని సేకరించి ఇండియన్ ఎంబసీ కి అందించి చివరగా మృతదేహాన్ని 13/02/2026 మలేసియా ఎయిర్ లైన్స్ M180 లో చెన్నై కి చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈఓ డాక్టర్ పి కృష్ణ మోహన్ గారు విమానాశ్రయం నుండి వారి గ్రామానికి ఉచితంగా అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు .
ఈ మృత దేహాన్ని పంపడానికి ఆయన మొత్తం ఖర్చు మలేషియా లోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించింది అని ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ , మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలియజేశారు.
అలాగే దీనికి సహకరించిన ఇండియన్ హై కమిషనర్ బి.ఎన్ రెడ్డికి, ఎఫ్.ఎన్.సి.ఏ-మలేషియా కోర్ కమిటీ సభ్యులకు మరియు APNRT సీఈఓ డాక్టర్ పి.కృష్ణ మోహన్ కి ఎఫ్.ఎన్.సి.ఏ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







