ఎన్.టి.ఆర్ టైటిల్ తో మెగా హీరో సినిమా
- July 30, 2016
మెగా హీరో అయ్యుండి యంగ్ టైగర్ కు షాక్ ఇచ్చే పని ఏం చేశాడనే కదా మీ డౌట్ సినిమాల విషయంలో ఎవరు ముందు నిర్ణయాలను తీసుకుంటారో వారికే కొన్ని టైటిల్స్ దక్కుతుంటాయి. ఇప్పుడు మెగా హీరో ఓ టైటిల్ విషయంలో జూనియర్ నిజంగానే అవాక్కయ్యేలా చేసిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఎన్.టి.ఆర్ కు షాక్ ఇచ్చిన మెగా హీరో ఎవరంటే అల్లు వారి రెండో అబ్బాయ్ అల్లు శిరీష్.అల్లు శిరీష్ హీరోగా వేణు మళ్లిడి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ గా 'జగదేక వీరుని కథ' అని పెట్టబోతున్నారట. సీనియర్ ఎన్.టి.ఆర్ కె.వి రెడ్డి గారి దర్శకత్వంలో చేసిన మైథలాజికల్ మూవీ జగదేక వీరుని కథ. ఇక అదే టైటిల్ తో అల్లు శిరీష్ కూడా ఓ సినిమా చేస్తున్నాడట.ఇక ఇందులో టూ షేడ్స్ ఉన్న పాత్రల్లో శిరీష్అందరినిఆశ్చర్యపరుస్తాడట. ఇక మెగా క్యాంప్ నుండి జగదేక వీరుని కథ అంటూ రాబోతున్న శిరీష్ నందమూరి హీరోలకు సవాల్ విసురుతున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం శ్రీరస్తు శుభమస్తు తో హిట్ కొట్టేందుకు సిద్ధమే అని చాటింపేస్తున్న శిరీష్ ఈ జగదేక వీరుని కథతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.ఓ రకంగా నందమూరి టైటిల్ ను మెగా హీరో వాడటం సినిమాకు మరింత క్రేజ్ వచ్చేలా చేసింది. శిరీష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందో. శ్రీరస్తు శుభమస్తు కోసం ఫేస్ లో ఓ కొత్త జోష్ ను నింపుకున్న శిరీష్ ఈసారి మెగా జోరు కొనసాగించేలానే ఉన్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







