బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!

- February 17, 2026 , by Maagulf
బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!

మనామా: బహ్రెయిన్ పబ్లిక్ ఫార్మసీల యాజమాన్యాన్ని బహ్రెయిన్ పౌరులకు పరిమితం చేయాలని, ఈ మేరకు పలువురు ఎంపీలు అత్యవసర ప్రతిపాదన సమర్పించారు.  ఇది ప్రొఫెషనల్ ప్రాక్టీస్‌పై బలమైన తనిఖీలు మరియు ఈ రంగంలో అధిక బహ్రెయిన్‌సేషన్ రేటును కూడా పెంచుతుందని పేర్కొన్నారు.  

ఫార్మసీ రంగంలో పనిచేసే బహ్రెయిన్‌ల వాటాను పెంచే విధంగా ఫార్మసీ వృత్తి, పబ్లిక్ ఫార్మసీ కేంద్రాలను నియంత్రించాలని ఈ ప్రతిపాదనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 1997 నాటి డిక్రీ-లా నంబర్ 18లోని ఆర్టికల్ 27ను అమలు చేయడంపై దృష్టి సారించాలని ఎంపీ ఖలీద్ సలేహ్ బువానాక్ కోరారు.    

ఫార్మసీలలో పనిచేసే వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఈ ప్రతిపాదనలో సూచించారు.  ఇది ఆరోగ్య సేవల నాణ్యతకు మద్దతు ఇస్తుందని మరియు ప్రజారోగ్యాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ ఫార్మసీలు ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించుకునే ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు అని, అందువల్ల మందుల సురక్షితమైన నిర్వహకుల చేతుల్లో ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనల్లో ప్రభుత్వాన్ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com