సౌదీలో అలమటిస్తున్న 800 మంది భారతీయులు సహాయక చర్యలకు ఆదేశించిన సుష్మ
- July 31, 2016
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో 10,000 మందికిపైగా భారత కార్మికులు "ఆహార సంక్షోభం" ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం చెప్పారు. ఉపాధి కోసం సౌదీలో జెడ్డాకు వెళ్లిన దాదాపు 800 మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. ట్విటర్ ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఒక వ్యక్తి తెలపడంతో ఆమె వెంటనే స్పందించారు. వారికి ఆహారం, ఇతర సహాయ సహకారాలు అందించాల్సిందిగా సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయాన్ని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సౌదీ అరేబియా, కువైట్లలో భారతీయులు ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఆయా దేశాల అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తారని, మరో మంత్రి వీకే సింగ్ సౌదీకి వెళతారని సుష్మా వెల్లడించారు. ఆయా దేశాల్లో పరిశ్రమలను మూసివేయడంతో పాటు యజమానులు జీతాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అందిస్తున్న ఆహార పదార్థాల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







