'తిక్క' మూవీ ట్రైలర్, ఆడియో లాంచ్ ...

- July 31, 2016 , by Maagulf
'తిక్క' మూవీ ట్రైలర్, ఆడియో లాంచ్ ...

మెగా హీరో సాయి ధరం తేజ్ తన మాస్ అవతారం నుంచి ఈసారి సరికొత్త రోల్‌లో బయటికి వచ్చాడు. తన కేరేర్‌లోనే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మక పాత్రలో నటించాడు. 'తిక్క' మూవీలో పూర్తి రొమాంటిక్, కామెడీ రోల్ పోషించడం విశేషం. ఇతని సరసన లారిస్సా బోన్సే, మన్నారా నటించిన ఈ సినిమాకు సునీల్ రెడ్డి దర్శకుడు.
శనివారం ఈ మూవీ ట్రైలర్, ఆడియో లాంచ్ చేశారు. తమిళ స్టార్స్ ధనుష్, శింబు సరదాగా ఈ చిత్రం కోసం పాట పాడారని, ఇదో వెరైటీ ప్రయోగమని మేకర్స్ అంటున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ కొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఆగస్టు 13న 'తిక్క' రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ చూస్తే టైటిల్‌కి తగినట్టే ఉందనే కామెంట్స్ మొదలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com