భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!
- February 20, 2026
కువైట్: కువైట్ ప్రధాని భద్రతా పరమైన సంసిద్ధతపై సమీక్షించారు. పొరుగున ఉన్న ఇరాన్‌పై అమెరికా దాడుల సన్నాహాల నేపథ్యంలో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కువైట్ ప్రధాన మంత్రి మరియు సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ కౌన్సిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై సమీక్షించారు. మరోవైపు, కువైట్ నేషనల్ గార్డ్ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ హమద్ అల్-బర్జాస్.. కువైట్ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి చర్యలకు అనుమతిస్తారా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఇరుపక్షాల మధ్య చర్చలు నిలిచిపోయినందున ఇరాన్ మరియు అమెరికా సాయుధ పోరాటం వైపు దగ్గరగా ఉన్నాయని యూఎస్ మీడియా పేర్కొంది. మరోవైపు, అరబ్ గల్ఫ్ దేశాలలోని యూఎస్ బేస్ లపై దాడి చేస్తామని ఇరాన్ పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నది.
తాజా వార్తలు
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్‌లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- మస్కట్‌లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!
- భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల









