పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- February 20, 2026
మనామాః పవిత్ర రమదాన్ మాసంలో పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్ పై బహ్రెయిన్ హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగంగా ఎవరైనా పాస్టింగ్ నియమాలను ఉల్లంఘించడం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని బహ్రెయిన్ లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. బహిరంగ పాస్టింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై కేసు పరిస్థితులను బట్టి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, BD100 వరకు జరిమానా లేదా రెండు శిక్షలను ఏక కాలంలో విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఈ చర్యలు రాజ్యంలో రమదాన్ పవిత్రతను గౌరవించే లక్ష్యంతో తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. పవిత్ర మాసంలో పాటించే చట్టాలు మరియు సంప్రదాయాలను పాటించాలని నివాసితులు మరియు సందర్శకులను అధికారులు కోరారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్‌లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- మస్కట్‌లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!









