హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు

- February 20, 2026 , by Maagulf
హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని చట్నీస్‌ హోటల్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు శబ్దానికి కస్టమర్లు భయపడి పరుగులు తీశారు.ఇడ్లీ స్టీమర్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేడికి కారణంగానే స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన ఫై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com