ఇఫ్తార్‌కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!

- February 20, 2026 , by Maagulf
ఇఫ్తార్‌కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!

దోహా: ఖతార్‌లో పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనందున, దేశవ్యాప్తంగా వీధులు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ఇఫ్తార్‌కు ముందు చివరి గంటలో అధిక వేగం గురించి అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇఫ్తార్‌కు ముందు ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతాయని పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది.

"మీ ప్రాణాలను లేదా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  “ఇఫ్తార్ కు ముందు అధిక వేగాన్ని నివారించండి. వేగాన్ని తగ్గించడం భద్రతను పెంచుతుంది మరియు ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మీ భద్రత మాకు ముఖ్యం.” అని మంత్రిత్వశాఖ తెలిపింది.                  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com