BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!

- February 20, 2026 , by Maagulf
BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!

మనామా: క్యాటరింగ్ వ్యాపారంలో చిన్న నగదును తన అవసరాలకు ఉపసంహరించుకున్న ఫిలిప్పీన్స్ ప్రవాసికి లోయర్ క్రిమినల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆమె సిబ్బంది బ్యాంకు ఖాతాల ద్వారా కంపెనీ మొత్తాలను సైక్లింగ్ చేయడం ద్వారా BD4,633 తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఆమె శిక్షాకాలం ముగిసిన తర్వాత బహిష్కరించాలని చెప్పింది. అయితే, ఆమెకు సహాయం చేసి, మోసం ద్వారా కంపెనీ డబ్బును పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండవ నిందితుడు, ఈజిప్షియన్ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేశారు.

సదరు మహిళ ఏప్రిల్ 2023లో HR మేనేజర్‌గా ఉద్యోగంలో చేరిందని, చిన్నచిన్న నగదు మరియు నిర్వహణ ఖర్చులకు కంపెనీ ఖాతా ఉన్న కార్డును ఆమెకు అప్పగించారు.  అనంతరం ఆమె వివిధ అవసరాల పేరుతో నగదును బదిలీ చేసింది. అనంతరం వాటిని తిరిగి తన అకౌంట్ కు బదిలీ చేయించుకున్నదని కోర్టు నిర్ధారించింది. ఇలా కంపెనీ డ్రైవర్ ద్వారా BD3,520, వంటవాడి ద్వారా BD873 మరియు మరొక డ్రైవర్ అకౌంట్ మరో BD240 తను పొందిందని కోర్టు తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com