మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- February 20, 2026
కువైట్: వైద్య ఉత్పత్తుల లైసెన్సింగ్ మరియు ట్రేడింగ్‌ను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లను రద్దు చేస్తూ కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఫార్మసీ కార్యాకలాపాలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయగా, ఒక కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.
అమల్లో ఉన్న చట్టాలను ఉల్లంఘించడంపై కఠినంగా వ్యవహారిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందిన ఫార్మసిస్ట్ లేకుండా పనిచేయడం, నమోదు లేదా తెలియని మూలాల నుండి మెడిసిన్ కొనడం, అమ్మడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలను గుర్తిస్తే పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడంతోపాటు వాటి లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామని, అలాగే నిర్వాహకులపై క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్‌కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









