కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- February 21, 2026
విజయవాడ: తెలుగు పాఠకులకు కార్టూన్ల ద్వారా బాగా పరిచితులైన మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టింది. ప్రభుత్వ సలహాదారుగా (సమాచార ప్రచార విభాగం) ఆయనను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు.
రెండేళ్ల పాటు ప్రభుత్వ సలహాదారుగా శ్రీధర్ రావు ఉంటారు. కేబినెట్ మంత్రి స్థాయిలో ఆయనకు జీతభత్యాలు, అలవెన్సులు వర్తిస్తాయి. ‘ఈనాడు’ దినపత్రికలో తన మార్క్ కార్టూన్లతో గుర్తింపు పొందిన శ్రీధర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై తన కార్టూన్లతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఆయనకు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం లభించడం విశేషం.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









