పెళ్లిని అధికారికంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ, రష్మిక
- February 22, 2026
పెళ్లిని అధికారికంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ, రష్మిక
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈసారి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తమ వివాహాన్ని ప్రకటించడం ద్వారా అన్ని సందేహాలకు ముగింపు పలికారు. తమ పెళ్లి వేడుకకు ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టినట్లు వెల్లడించడం ఈ ప్రకటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
‘విరోష్’ (VIROSH) అనే పేరును ఏ వెడ్డింగ్ ప్లానర్లు, కుటుంబ సభ్యులు సూచించలేదని, ఎన్నో ఏళ్ల క్రితం తమ అభిమానులు ప్రేమతో సృష్టించినదేనని తెలిపారు. తాము ఎలాంటి ప్రణాళికలు వేసుకోకముందే, అభిమానులు తమ బంధానికి ఓ అర్థం ఇచ్చారని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఉద్వేగభరితమైన నోట్‌ను పంచుకున్నారు.
“మా ప్రియమైన వారికి, మేము ఎలాంటి ప్రణాళికలు వేసుకోకముందే, మా కోసం మేము ఏదీ ఎంచుకోకముందే.. మీరు అప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఎంతో ప్రేమతో, మీరు మాకు ఒక పేరు ఇచ్చారు. మమ్మల్ని ‘విరోష్’ అని పిలిచారు. కాబట్టి ఈ రోజు నిండు మనసుతో, మా ఈ కలయికకు మీ గౌరవార్థం ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెడుతున్నాం. మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మాలో భాగమే!” అని రాసుకొచ్చారు.కాగా, ఈ నెల 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







