'భోగి' యాక్షన్ షెడ్యూల్ ఈరోజు దిలీప్ సుబ్బరాయన్ మాస్టర్ సూపర్ విజన్ లో ప్రారంభం
- February 23, 2026
సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'నారీ నారీ నడుమ మురారి'తో అలరించిన చార్మింగ్ స్టార్ శర్వా, ఇప్పుడు తొలిసారిగా యాక్షన్ స్పెషలిస్ట్ సంపత్ నందితో కలిసి 'భోగి' అనే భారీ పాన్-ఇండియన్ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. సినిమా వరల్డ్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ స్పార్క్ కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
టీమ్ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. అందులో శర్వా, ఇతర నటీనటులతో కొన్ని టాకీ పార్ట్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ కీలక షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించారు. ఈ షెడ్యూల్‌లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు ఉండగా, వాటికి ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యే వరకు శర్వా నాన్ స్టాప్ గా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
స్ట్రైకింగ్ మోనోక్రోమ్‌లో చిత్రీకరించిన షూట్ ఫ్రేమ్‌లో శర్వా రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్‌ను పట్టుకుని కనిపిస్తున్నారు. పొగ, ధూళి మధ్య అతని సిల్హౌట్ ఫెరోషియస్ ఇంటెన్సిటీని ప్రజెంట్ చేస్తోంది. అతని ముందువైపు దర్శకుడు సంపత్ నంది, స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ కనిపిస్తున్నారు. ఈ ఇమేజ్ సినిమాకి ఉండే యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్సిటీని హైలైట్ చేస్తోంది.
1960 నేపథ్యంలో భోగి చిత్రం ఇంటెన్స్ ఎమోషన్స్, రా ఎనర్జీ, హై వోల్టేజ్ డ్రామాతో నిండిన కథగా రూపొందుతోంది. దర్శకుడు సంపత్ నంది పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు.
తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తున్న భోగిలో శర్వా పూర్తి కొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ఆధ్వర్యంలో పీరియడ్ డీటైలింగ్, రస్టిక్ ల్యాండ్‌స్కేప్స్, గ్రౌండెడ్ ఎస్తేటిక్ రూపొందించారు. సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా నిర్వహిస్తుండగా, బ్లాక్‌బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మిగతా సాంకేతిక బృంద వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
భోగి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: కిషోర్ కుమార్ ఆరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









