సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- February 23, 2026
సురబయః సౌదీ అరేబియాలోని రెండు పవిత్ర మస్జీదుల ఇఫ్తార్ కార్యక్రమం కింద ఇండోనేషియాలోని సురబయలోని గ్రాండ్ మస్జీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కు 21,500 మంది హాజరయ్యారు. ఇది అతిపెద్ద రమదాన్ సమావేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండోనేషియాలోని సౌదీ రాయబార కార్యాలయంలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఫ్తార్ తోపాటు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడి బహుమతిని కలిపి పంపిణీ చేశారు. తూర్పు జావా గవర్నర్ ఖోఫిఫా ఇందార్ పరవాన్సా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. ఇస్లాం మరియు ముస్లింలకు సేవ చేయడంలో సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఇస్లామిక్ మరియు మానవతావాద పనులకు.. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియా చేస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని సౌదీ మత అనుబంధ అహ్మద్ అల్-హజ్మీ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







