తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- February 23, 2026
భారత్ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానంగా గుర్తింపు పొందిన తేజస్ ఫైటర్ జెట్లు ఇటీవల వరుస ప్రమాదాలతో చర్చనీయాంశంగా మారాయి. తాజా వైమానిక విన్యాసాల్లో మరో తేజస్ విమానం కుప్పకూలడంతో భారత వైమానిక దళం (IAF) దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం సేవలో ఉన్న తేజస్ విమానాలపై విస్తృత సాంకేతిక తనిఖీలు చేపట్టినట్లు వర్గాలు తెలిపాయి.
ఈ నెల ప్రారంభంలో సాధారణ శిక్షణా కార్యక్రమం అనంతరం ల్యాండింగ్ సమయంలో తేజస్ జెట్ ప్రమాదానికి గురైంది. ప్రాథమిక అంచనా ప్రకారం సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆన్‌బోర్డ్ వ్యవస్థల్లో లోపం ఉండవచ్చని వైమానిక దళ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమాదం తర్వాత భద్రతా చర్యలలో భాగంగా దాదాపు 30 సింగిల్-సీట్ తేజస్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా కుప్పకూలిన విమానం ఎయిర్‌ఫ్రేమ్ తీవ్రంగా దెబ్బతినడంతో సేవ నుంచి తొలగించే యోచనలో ఉన్నారు. అయితే పైలట్ సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించే విషయం. ఇది ఐఏఎఫ్‌లో చేరిన తర్వాత తేజస్ జెట్లకు మూడో ప్రమాదం. 2024 మార్చిలో జైసల్మేర్ సమీపంలో తొలి ఘటన, 2025 నవంబర్‌లో దుబాయ్ ఎయిర్‌షోలో రెండో ఘటన జరిగింది. తాజాగా మూడోసారి ప్రమాదం జరగడంతో భద్రతపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









