ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- February 23, 2026
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార డీఎంకే, బీజేపీ-అన్నాడీఎంకే కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కోయంబత్తూరు వేదికగా జరిగిన యువజన విభాగం సమావేశంలో ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు.
కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘మాకు నరేంద్ర మోదీ అంటే భయం లేదు. మోదీ తండ్రి వచ్చినా సరే మేము భయపడబోము” అని వ్యాఖ్యానించారు. టీవీలో మోదీ కనిపిస్తే ప్రజలు భయపడుతున్నారని, అదే సీఎం స్టాలిన్ కనిపిస్తే కొత్త పథకాలు వస్తాయని సంతోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ‘తమిళనాడు వర్సెస్ ఢిల్లీ’ మధ్య జరుగుతున్న పోరాటమని ఉదయనిధి అభివర్ణించారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ స్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే పార్టీకి సంస్కారం, నీతి లేదని ఆ పార్టీ ప్రతినిధి షెజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వెనుకబడిన తరగతి నుంచి వచ్చారు కాబట్టే డీఎంకే, ఇండియా కూటమి నేతలు ఆయన తల్లిదండ్రులను పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









