కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!

- February 23, 2026 , by Maagulf
కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!

కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ  సెకండ్ రింగ్ రోడ్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్ ని నిర్వహించింది. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ ను చేపట్టినట్లు పేర్కొంది. ఇందులో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. 

ఈ డ్రైవ్ సందర్భంగా ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  అలాగే, తప్పించుకుతిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అన్ని గవర్నరేట్లలో ఇంటెన్సివ్ సెక్యూరిటీ మరియు ట్రాఫిక్ డ్రైవ్ లు కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పట్టుబడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com