యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!

- February 23, 2026 , by Maagulf
యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!

యూఏఈ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ ప్రకారం.. ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఫెడరల్ ప్రభుత్వ సంస్థలకు మార్చి 19 (గురువారం)  నుండి మార్చి 22(ఆదివారం) వరకు సెలవులను ప్రకటించారు. ఇక తిరిగా అధికారిక పనివేళలు మార్చి 23(సోమవారం) న ప్రారంభమవుతాయి.

ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి మార్చి 19(గురువారం)  నుండి మార్చి 21 (శనివారం) వరకు సెలవులు ప్రకటించారు. అయితే, పవిత్ర రమదాన్ 30 రోజులు ఉంటే, సెలవుదినం మార్చి 22(ఆదివారం) వరకు పొడిగించబడుతుందని తన ఉత్తర్వుల్లో మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com