డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- February 23, 2026
మనామా: షురా కౌన్సిల్ డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్ ను డిస్కషన్ సెషన్ నుంచి విత్ డ్రా చేశారు. దానిపై మరింత అధ్యయనం చేయాలని కమిటీకి తిరిగి పంపారు. డాక్టర్ ఎబ్టెసం అల్ దల్లాల్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. తదుపరి సమావేశంలో కొత్త సమీక్ష కోసం ముసాయిదాను విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీకి తిరిగి ఇవ్వడానికి సభ్యులు అంగీకరించారు.
ఈ ప్రతిపాదన సమాచార సాంకేతిక నేరాలపై 2014 నాటి చట్టం నంబర్ 60కి కొత్త ఆర్టికల్ 10 బిస్‌ను కలపాలని ప్రతిపాదించారు. ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించి ఆడియో లేదా వీడియే విషయాలను తయారు చేసి , ప్రసారం చేసే, ఎవరినైనా ఇది శిక్షిస్తుంది. ఈ ముసాయిదాలో 3,000 నుండి 10,000 దినార్ల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష విధించడానికి వీలు కల్పించారు.
ఈ ప్రతిపాదనను అలీ అల్ షిహాబి, మొదటి డిప్యూటీ చైర్మన్ జమాల్ ఫఖ్రో, డాక్టర్ మొహమ్మద్ అలీ హసన్, ఖలీద్ అల్ మస్కతి మరియు దలాల్ అల్ జాయెద్ సమర్పించారు. ప్రస్తుత రూపంలో దీనిని ఆమోదించవద్దని కమిటీ సభ్యులను కోరింది. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాలు కల్పిత ఈ తరహా నేరాలను కవర్ చేస్తున్నాయని పేర్కొన్నారు. డీప్‌ఫేక్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించి ఆడియో లేదా వీడియోను సృష్టించడం నేరంగా పరిగణిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









